ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని పొందడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ ను యాక్టివేట్ చేయాలి. దీనిని యాక్టివేట్ చేయడానికి మరియు మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 15. ఈ నెల 02న EPFO జారీ చేసిన సర్క్యులర్‌లో, UAN యాక్టివేషన్ & బ్యాంకు ఖాతాలో ఆధార్ సీడింగ్ కోసం తుది గడువును 15 ఫిబ్రవరి 2025 వరకు పొడిగించిందని కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది.UAN అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. ఇది, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా కంపెనీ యాజమాన్యం & ఉద్యోగి ఇద్దరికీ జారీ అయిన 12 అంకెల సంఖ్య, ఈ సంఖ్య ద్వారా ఆ ఇద్దరూ ఉద్యోగి EPF ఖాతాకు తమ సహకారాన్ని అందిస్తారు. UAN సహాయంతో, ఉద్యోగి తన EPFO ఖాతాను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడమే కాకుండా దానిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగుల కోసం ప్రారంభించిన స్కీమ్ - 'ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం'. మొదటి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు, ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం ఒక నెల జీతం రూపంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ అందిస్తుంది. మూడు విడతలుగా ఇచ్చే ఈ మొత్తం గరిష్ట పరిమితి రూ. 15,000. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే, ఉద్యోగి నెలవారీ జీతం లక్ష రూపాయలకు మించకూడదు. ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రోత్సాహకం నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాకు వెళుతుంది, కాబట్టి ఆధార్ ఆధారిత OTP ద్వారా UANను యాక్టివేట్ చేయడం & బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను లింక్ చేయడం అవసరం.
ఈపీఎఫ్ ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం !
February 15, 2025
0
Tags