మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ పై సైబర్ ఎటాక్ జరిగింది. నకిలీ ఈమెయిల్ ద్వారా 5 కోట్ల 47 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి మేఘా సంస్థ అకౌంట్ మేనేజర్ శ్రీహరి ఫిర్యాదు చేశారు. మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విప్ మెంట్ నెదర్లాండ్స్ కి చెందిన ఓ కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు. ఆ కంపెనీకి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు చేశారు. చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేదని అంటున్నారు. అయితే ఇక్కడే ఆ కంపెనీ లాగానే ఈ-మెయిల్లో ఒక అక్షరం మార్చి కొన్ని కారణాలవల్ల మీరు పంపించే అకౌంట్ పనిచేయడం లేదు మరో అకౌంట్ కి డబ్బులు చెల్లించాలంటూ మేఘా కంపెనీకి మెయిల్ పంపించారట సైబర్ నేరగాళ్లు. అది నిజమని నమ్మి 5 కోట్ల 47 లక్షలు రెండు విడతలుగా చెల్లించిందట మేఘా కంపెనీ. అదే కంపెనీ నుండి మరో మెయిల్ డబ్బులు ఇంకా చెల్లించలేదని రావడంతో.. మోసపోయామని గ్రహించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో మేఘా కంపెనీ ఫిర్యాదు చేసింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫాస్ట్రక్చర్ పై సైబర్ ఎటాక్ ?
February 15, 2025
0
Tags