ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లను, రికార్డులను తొలగించొద్దు : జీఏడీ ఆదేశాలు

Telugu Lo Computer
0


ఢిల్లీ సచివాలయంలో ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డులను తొలగించొద్దని అన్ని విభాగాలకు ఆదేశాలు అందాయి. ఆయన సూచనల మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. ''భద్రతాపరమైన సమస్యలు, రికార్డుల భద్రతను పరిరక్షించుకునేందుకు ఈ అభ్యర్థన చేశాం'' అని జీఏడీ పేర్కొంది. సచివాలయంలోని అన్ని శాఖల ఇంఛార్జిలు, సెక్రటేరియట్ కార్యాలయాలు, మంత్రుల క్యాంపు కార్యాలయాలకు ఈ ఉత్వర్వులు వర్తిస్తాయని, అన్ని రికార్డులను భద్రపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. భాజపా విజయం సాధించిన తర్వాత ఈ నిర్ణయం వెలువడటం చర్చనీయాంశమైంది. అయితే ఈ ఉత్తర్వులు పాలనలో భాగమని, అధికారమార్పిడి జరగబోతున్న తరుణంలో ముఖ్యమైన ప్రభుత్వ రికార్డులు దుర్వినియోగం కాకుండా చూడడమే వాటి ఉద్దేశమని అధికారులు చెప్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)