మహా కుంభమేళా దేశ ఐక్యతకు చిహ్నం : ప్రధాని నరేంద్ర మోడీ

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పుర్‌లో భాగేశ్వర్‌ ధామ్‌ మెడికల్‌ అండ్‌ సైన్స్‌ రీసెర్చి సెంటర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం తనకు ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించింది. సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ మంత్రంపై దృష్టిసారించానన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళా దేశ ఐక్యతకు చిహ్నంగా భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. కోట్లాది మంది తరలి వస్తున్న మహా కుంభమేళాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. భారతదేశ మత, సాంస్కృతిక సంప్రదాయాలను వ్యతిరేకిస్తున్నవారిపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. ''ఇటీవల కాలంలో ప్రజల్ని విభజించే నేతల గుంపును చూస్తున్నాం. అనేక సార్లు విదేశీ శక్తులు సైతం ఈ వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు శతాబ్దాలుగా ఏదో ఒక దశలో ఉంటున్నారు. బానిస మనస్తత్వం కలిగిన వ్యక్తులు మన విశ్వాసాలు, నమ్మకాలు, ఆలయాలు, మతం, సంస్కృతి, సూత్రాలపై దాడి కొనసాగిస్తున్నారు. వీరు మన పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలను దుర్వినియోగం చేస్తారు. మన సమాజాన్ని విభజించడం, తద్వారా ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే వారి అజెండా. ఇలాంటి సమయంలో ఎంతో కాలంగా దేశంలో ఐక్యతా మంత్రం గురించి అవగాహన కల్పిస్తోన్న ధీరేంద్ర శాస్త్రి ప్రజల ప్రయోజనాల కోసం పదెకరాల్లో క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించడం గొప్ప విషయం. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో క్యాన్సర్‌ నియంత్రణకు పలు ప్రకటనలు చేశాం. క్యాన్సర్‌ ఔషధాలు మరింత చౌకగా లభించేలా నిర్ణయం తీసుకున్నాం. రాబోయే మూడేళ్లలో దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ డేకేర్‌ సెంటర్లును ఏర్పాటు చేస్తున్నాం అని మోడీ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)