సోమవారానికి పార్లమెంట్ వాయిదా !

Telugu Lo Computer
0


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ లో 2025-26 ఆర్ధికా సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ లో మొత్తం ఐదు ప్రధాన అంశాలే లక్ష్యంగా చేసుకున్నట్లు ఆమె ప్రసంగంలో తెలిపారు. అందులో వృద్ధిని పెంచడం, సమ్మిళి అభివృద్ధి, ప్రయివేట్ సెక్టార్ పెట్టుబడులు పెంచడం, హౌస్ హోల్డ్ సెంటిమెంట్ ను పెంచడం, 5, భారత్ లో పెరుగుతున్న మధ్యతరగతి స్పెండింగ్ పవర్ ను వృద్ది చేయడం లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం 11 గంటలకు ప్రారంభం కాగా మొత్తం 1 గంట 15 నిమిషాలు ప్రసంగం కొనసాగింది. 3వ తేదీన ఉదయం 11 గంటలకు లోక్ సభ తిరిగి ప్రారంభం కానుంది. కాగా బడ్జెట్ ప్రారంభంలోని యూపీ తొక్కిసలాటపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)