రూ. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర బడ్జట్ 2025-26 కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రూ.0-4 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను లేదు. రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు 5 శాతం పన్ను విధించనున్నారు. రూ.8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10 శాతం పన్ను వేస్తారు. రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షల ఆదాయం ఉన్న వారికి 15 శాతం వసూలు చేస్తారు. రూ 16 నుంచి 20 లక్షల వరకు 20 శాతం పన్ను విధిస్తారు.
ఆదాయ పన్నులో కొత్త శ్లాబులు అమలు !
February 01, 2025
0
Tags