దేశంలో పట్టణీకరణ శరవేగంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను నెలకొల్పబోతోన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. లక్ష కోట్ల రూపాయలతో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పట్టణీకరణ వేగవంతమౌతోందని, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొనడానికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను నెలకొల్పాలని ప్రతిపాదిస్తోన్నట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. ఇందులో 25 శాతం వరకు బ్యాంక్ ప్రాజెక్టులు. మరో 50 శాతం బాండ్ల ద్వారా నిధులను సమీకరించాల్సి ఉంటుంది. మిగిలిన 25 శాతం మేర నిధులను బ్యాంకులు, పీపీపీ విధానంలో సమీకరిస్తారు. అలాగే కేపిటల్ ఎక్స్‌పెండిచర్ (క్యాపెక్స్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల కోసం 1.5 లక్షల కోట్ల రూపాయలను 50 సంవత్సరాల పాటు ఎలాంటి రుణాలు లేకుండా రాష్ట్రాలకు అందజేయనున్నట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. ప్రతి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-సంబంధిత మంత్రిత్వ శాఖ పీపీపీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లకు మూడు సంవత్సరాల కాల పరిమితితో నిధులు అందుతాయి.
లక్ష కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ !
February 01, 2025
0
Tags