నార్సింగిలో హోర్డింగ్‌ స్తంభాన్నికారు ఢీకొని వైద్యుడి మృతి

Telugu Lo Computer
0


హైదరాబాద్ నగర శివారు నార్సింగిలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జశ్వంత్‌, భూమిక కామినేని ఆస్పత్రిలో హౌస్‌ సర్జన్స్‌గా పని చేస్తున్నారు. జన్వాడలోని ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఖానాపూర్ వద్ద హోర్డింగ్ స్తంభాన్ని వారి కారు ఢీకొంది. ఈ ఘటనలో జశ్వంత్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. భూమికకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన భూమికను ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)