యమునా నదిలో కాలుష్య ప్రక్షాళన ప్రారంభం !

Telugu Lo Computer
0


న్యూఢిల్లీలోని యమునా నదిలో కాలుష్య ప్రక్షాళన పనులు ప్రారంభమైనాయి. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టే రెండు రోజుల ముందు ఈ నదీ ప్రక్షాళన కార్యక్రమం మొదలైంది. అందుకోసం ఢిల్లీ ప్రభుత్వం పక్కా కార్యాచరణ రూపొందించింది. అందులోభాగంగా చెత్త స్కిమ్మర్లు, కలుపు మొక్కలు తీసే యంత్రాలతో నదిలో క్లీనింగ్ పనులు చేపట్టారు. యమునా నదిని శుభ్రం చేసేందుకు బహుముఖ వ్యూహాంతో ప్రభుత్వం ముందుకు వెళ్లోంది. మూడు సంవత్సరాల్లో యమునా నదిని ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం నిర్దేశించుకొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. తాము అధికారంలోకి వస్తే యమునా నదిని శుభ్రం చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందు పరిచింది. నదిని పునరుద్దరించడంలో భాగంగా యమునను శుభ్రపరిచి.. ఆ నీటిని సాగు, తాగు నీటికి వినియోగించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో యమున నదిని శుభ్రపరిచే కార్యక్రమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 15వ తేదీన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఉన్నతాధికారులతో సమావేశమై యమునా నదిలోని నీటి ప్రక్షాళనకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి.. ఉన్నత స్థాయికి వారాంతంలో నివేదిక అందచేయాలని అది కూడా ఈ సమావేశంలో ఎల్ జీ ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)