తెలంగాణలోని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి తాను స్వతంత్రంగా ఉంటానని, ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. గత ఏడాది మార్చి 6న ఆయన బీఆర్ఎస్ ను వీడి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా
February 21, 2025
0
Tags