కుంభమేళాకు పోటెత్తిన భక్తులు !

Telugu Lo Computer
0


మహా కుంభమేళ ఆఖరి వారంలో భక్తులు పోటెత్తుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య దాదాపు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. మహాకుంభ్‌ శక్తిని యావత్‌ ప్రపంచం కీర్తిస్తోందని ఆయన పేర్కొన్నారు. మన రాష్ట్ర సామర్థ్యం, అభివృద్ధిపై నమ్మకం లేనివారు కుంభమేళాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రతీ 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా జనవరి 13న మొదలుకాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 నుంచి 45 కోట్ల మంది రావచ్చని తొలుత అంచనా వేశారు. కానీ, ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సరాసరి కోటిన్నర మంది వరకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)