నడిరోడ్డుపై తండ్రిని చంపిన తనయుడు !

Telugu Lo Computer
0


సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి (45)ని అతని కుమారుడు సాయి కుమార్ (25) ఇద్దరూ ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌లో పనిచేస్తున్నారు. మొగిలి నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తుండటంతో సాయికుమార్‌ విసిగిపోయాడు. శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి మొగిలి బస్సులో బయలుదేరగా.. అతని కుమారుడు ద్విచక్రవాహనంపై అనుసరించాడు. ఈసీఐఎల్‌ బస్‌ టెర్మినల్‌ వద్ద బస్సు దిగిన తండ్రిని తన వెంట తెచ్చుకున్న చాకుతో విచక్షణారహితగా 10 -15 సార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన మొగిలిని స్థానికులు సమీపంలో ఉన్న శ్రీకర ఆసుపత్రికి తరలించగా చికత్స పొందుతూ మృతి చెందాడు. కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల కారణంగానే తండ్రిపై సాయికుమార్‌ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)