ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో ఏపీ ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తమ ముందున్న ద్యేయం అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరుతున్నామని తెలిపారు. చంద్రబాబు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఎమ్మార్పీఎస్ అండగా నిలిచింది. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం యావత్ దళితులు అహర్నిశలు కష్టపడ్డారు. ఇదే విషయం ఎన్నో సభల్లో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి నేతలను ఇబ్బంది పెట్టినా ధైర్యంగా యావత్ మాదిగ జాతి అండగా నిలిచిందని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి : మందకృష్ణ మాదిగ
February 22, 2025
0
Tags