జొమాటో పేరు ఎటర్నల్‌గా మార్పు !

Telugu Lo Computer
0


జొమాటో తన పేరును ఎటర్నల్‌గా మార్చుకుందని, కంపెనీ బోర్డు కూడా దీనికి ఆమోదం తెలిపిందని కంపెనీ ఫిబ్రవరి 6న స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ సంస్థ తన సేవలను విస్తరిస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగానే బ్లింకిట్‌ను ప్రారంభించింది. ఆ క్విక్ కామర్స్ రంగంలో కూడా ఈ సంస్థ వేగంగా ఎదుగుతుంది. జొమాటో గ్రూప్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ బీఎస్ఈకి దాఖలు చేసిన లేఖలో ఇలా తెలిపారు. మేము బ్లింకిట్‌ను కొనుగోలు చేసినప్పుడు కంపెనీ, బ్రాండ్/యాప్ మధ్య తేడాను గుర్తించడానికి అంతర్గతంగా "ఎటర్నల్" (జొమాటోకు బదులుగా) ఉపయోగించడం ప్రారంభించాము. జొమాటోకు మించి ఏదో ఒక వ్యాపారం మా భవిష్యత్తుకు ముఖ్యమైనగా మారిన రోజు మేము కంపెనీ పేరును ఎటర్నల్‌గా మార్చాలని అనుకున్నాము. ఈరోజు బ్లింకిట్‌తో మేము అనుకున్న స్థాయికి చేరుకున్నామని భావిస్తున్నాను. ఇదే సరైన సమయమని భావించి కంపెనీ పేరును ఎటర్నల్ లిమిటెడ్‌గా మార్చాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 1, 2022న కంపెనీ తన పేరును మార్చుకున్నట్లు మనీకంట్రోల్ మొదట నివేదించింది. అయితే గోయల్ ఈ నివేదికను తోసిపుచ్చారు. ఎటర్నల్ అనేది అంతర్గత పేరు, జొమాటో యాప్ పేరు మార్చడానికి ఎటువంటి ప్రణాళికలు లేవని చెప్పారు. ఖచ్చితంగా చెప్పాలంటే, జొమాటో యాప్ పేరు మార్చబడదు. కానీ స్టాక్ టిక్కర్ జొమాటో నుండి ఎటర్నల్‌గా మారుతుంది. ఎటర్నల్‌లో నాలుగు ప్రధాన వ్యాపారాలు ప్రస్తుతానికి ఉంటాయి అవి జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్‌ప్యూర్.

Post a Comment

0Comments

Post a Comment (0)