ఐదేళ్ల తర్వాత రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ !

Telugu Lo Computer
0


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ  ఈ రోజు జరిగిన సమావేశంలో రెపో రటును 25 బేస్ పాయింట్స్ ను తగ్గించింది. ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. తాజా తగ్గింపుతో రెపోరేటు 6.25%గా నిర్ణయించబడింది. 5 ఏళ్ల తర్వాత ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించింది. రెపో రేటు తగ్గింపు ప్రకటన సందర్భంగా గవర్నర్ మల్హోత్రా గ్లోబల్ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కొనసాగుతోందని తెలిపారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పురోగతి కాస్తా ఆగిపోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు తక్కువ వడ్డీ రేటు వద్ద రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలు పొందుతాయి. దీని వల్ల బ్యాంకులు సాధారణ వినియోగదారులకు అందించే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముంది. ముఖ్యంగా గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపవచ్చు. రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో దేశీయ మార్కెట్‌ స్పందనపై ఆర్థిక రంగం దృష్టి సారించింది. రానున్న రోజుల్లో ఈ నిర్ణయం దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆసక్తికరంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)