హత్రాస్ ఘటనలో భోలే బాబాకు క్లీన్ చిట్ ?

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో గతేడాది 121 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల జ్యుడిషియల్ కమిషన్ యూపీ ప్రభుత్వానికి పూర్తి నివేదికను సమర్పించింది. ఈ ఘటనతో భోలే బాబాకు సంబంధం లేదని తెలుపుతూ కమిషన్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు పలు వార్తా సంస్థలు వస్తున్నాయి. భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం వల్ల తొక్కిసలాటలో ఊపిరాడని కారణంగానే వారు మరణించారని నివేదికల్లో తెలిపినట్లు సమాచారం. ఈ నివేదిక ప్రకారం సత్సంగ్ కార్యక్రమ నిర్వహకులు, పోలీసులు సరైన ఏర్పాట్లు చేయనందువల్ల, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని జ్యుడిషియల్ కమిషన్ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)