కేసీఆర్ పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు ?

Telugu Lo Computer
0


తెలంగాణలోని నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లు కేసీఆర్ పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రశ్నించారు. మోడీ, కేసీఆర్ పరిపాలన పై చర్చ పెడదాం. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు, ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలన, 12 నెలల తెలంగాణలో ప్రజా పాలన పై చర్చ పెడుదాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరపున, ప్రతిపక్ష హోదా తరపున బీఆర్ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరపున నేను వస్తా ఎక్కడైనా సరే చర్చిద్దాం అని సవాల్ విసిరారు. ఆనాడు కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే చూస్తూ కూర్చుంది నీవు కాదా..? అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో పరిశ్రమలు ఎందుకు తరలించుకుపోాయారు. కేసీఆర్ గట్టిగా కొడతా అంటున్నాడు.. గట్టిగా కొట్టేది అంటే ఫుల్, హాప్ తప్ప ఏమి కొట్టలేవు అని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)