హ్యుందాయ్ క్రెటా డెలివరీ పీరియడ్ మూడు నెలలు ?

Telugu Lo Computer
0

హ్యుందాయ్ క్రెటా, క్రెటా ఎన్ లను బుక్ చేసుకుంటే వాటి డెలివరీ కోసం చాలా కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. కనీసం డెలివరీ కోసం మూడు నెలల వరకు వేచి ఉండాల్సి రావచ్చు. అయితే, ఈ వేచి ఉండే వ్యవధిని కొన్ని నగరాలకు మాత్రమే పొడిగించారు. ఏయే నగరంలో ఎంత వెయిటింగ్ పిరియడ్ ఉందో చెక్ చేసుకుని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. న్యూఢిల్లీలో నివసిస్తున్న వాళ్లకు క్రెటా డెలివరీ పొందడానికి 1 నెల, క్రెటా N లైన్ కోసం ఒక నెల వేచి ఉండాలి. బెంగళూరులో క్రెటా, క్రెటా N కోసం వేచి ఉండే కాలం ఒకటి నుండి ఒకటిన్నర నెలలు. ముంబైలో 2 నెలలు, హైదరాబాద్‌లో 1 నుండి 2 నెలలు, పూణేలో నివసిస్తుంటే క్రెటా కోసం గరిష్టంగా 2-3 నెలలు వేచి ఉండాల్సి రావచ్చు. గురుగ్రామ్‌లో నివసిస్తుంటే 2 నెలలు వేచి ఉండాల్సి రావచ్చు, నోయిడాకు కూడా 2 నెలలు వేచి ఉండాల్సి రావచ్చు. హ్యుందాయ్ క్రెటాలో లెవల్-2 ADAS తో 70 అధునాతన సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. దీని 7 వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో E, EX, S, S(O), SX, SX Tech, SX (O) వేరియంట్‌లు ఉన్నాయి. దీనిలో ముందు, వెనుక USB పోర్ట్‌తో మాన్యువల్ AC పొందుతారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంది కానీ దీనిని i20, ఎక్సెటర్ తో షేర్ చేశారు. ఈ కారులో సెంట్రల్, రిమోట్ లాకింగ్ సిస్టమ్‌ అమర్చారు. హ్యుందాయ్ క్రెటా లీటరుకు 17.4 నుండి 21.8 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)