తమిళనాడు, కృష్ణగిరి సమీపంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ విద్యార్థిని నెల రోజులుగా బడికి రాకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు, సహ విద్యార్థినులు విచారించగా సరైన సమాధానం రాలేదు. దీంతో బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లిని ప్రశ్నించారు. ఆమె గర్భవతి అయ్యిందని, అబార్షన్ చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడి సూచన మేరకు జిల్లా బాలల భద్రతాధికారులను సంప్రదించారు. అధికారులు బాలికను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బర్గూర్ ఆల్ ఉమన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బర్గూర్ డీఎస్పీ నేతృత్వంలోని మహిళా పోలీసులు వెంటనే స్పందించి పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులైన చిన్నసామి (57), ఆరుముగం (45), ప్రకాశ్ (37)లను మంగళవారం అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
8వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయులు అత్యాచారం !
February 06, 2025
0
Tags