ఈటో మోటార్స్ ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్రంలోని ఈవీ పాలసీ ప్రకారం, రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు. ఈ విధానం వల్ల కాలుష్యాన్ని తగ్గించడం, నగరంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడం సాధ్యమవుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా నగరంలోని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని, ఇతర వాహనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడంలో ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు.ఈటో మోటార్స్ ఫ్లిక్స్ బస్ ఎలక్ట్రిక్ బస్సును మొదటిసారి తెలంగాణలో ప్రారంభించడం, రాష్ట్రంలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న కొత్త చర్యలు చూపిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. రవాణా శాఖకి సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలని, ఈవీ బస్సుల వినియోగం పెరిగితే, భవిష్యత్తులో మరిన్ని రకాల ఈవీ బస్సులు ప్రవేశపెట్టాలని అన్నారు. బలహీన వర్గాల బిడ్డగా బీసీ సంఘాల దగ్గరకు రావడానికి నేను సిద్ధమని, అందుకు రోడ్ మ్యాప్ ఇవ్వండని తెలిపారు.
ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ !
February 06, 2025
0
Tags