ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్టు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ''ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించా. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించా. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలనికోరా. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఆరా తీశారు. కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని కోరాను. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో ఐటీ సేవలు, గ్రీన్ హైడ్రోజన్, రెన్యువబుల్ ఎనర్జీ విస్తరిస్తాం. దేవాలయాల్లో ఇతర మతాచారాలు పాటించేవారిని తప్పించడం సాధారణమే. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా పలువురిని కలుస్తాం. ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకే ప్రశాంత్ కిశోర్‌ను కలిశా. ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ దారుణంగా దెబ్బతింది. వైకాపా పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు తగ్గారు. ఐదేళ్లలో 45 లక్షల నుంచి 32 లక్షలకు పిల్లలు తగ్గిపోయారు'' అని లోకేశ్ వివరించారు.
ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరాను : మంత్రి లోకేశ్
February 05, 2025
0
Tags