ఢిల్లీలో స్వల్ప భూప్రంకపనలు : రిక్టర్ స్కేలుపై 4గా నమోదు

Telugu Lo Computer
0


ఢిల్లీలో ఈరోజు ఉదయం స్వల్ప భూప్రంకపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ వేదికగా తెలిపింది. ప్రకంపనలు ఉదయం 5:36 గంటలకు సంభవించాయని వెల్లడించింది. అంతేకాకుండా ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా బలమైన భూ ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంది. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమేనని స్పష్టం చేసింది. కొన్ని సెకన్ల పాటు మాత్రమే భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)