దుబాయ్ విమాన లగేజీ నిబంధనల్లో మార్పులు !

Telugu Lo Computer
0


ప్రయాణికుల సురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని దుబాయ్‌ విమానాశ్రయం దాని నియమాలలో కొన్ని మార్పులు చేసింది.  చాలా సార్లు ప్రయాణికులు తమకు తెలియకుండానే అనుమతి లేని కొన్ని వస్తువులను తమతో విమానంలోకి తీసుకెళ్తుంటారు. వీటిని విమానంలో తీసుకెళ్లడం చట్టపరమైన నేరంగా పరిగణిస్తారు. దుబాయ్ వెళ్తుంటే విమానంలో చెక్-ఇన్ లగేజీతో పాటు క్యాబిన్ బ్యాగేజీలో ఏమి ప్యాక్ చేయవచ్చు.. ఏమి చేయకూడదు అనే విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. కొకైన్, హెరాయిన్, గసగసాలు, మత్తు కలిగించే మందులు, తమలపాకులు, కొన్ని మూలికలు వంటివి కూడా తీసుకెళ్లకూడదు. ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు, జూద వస్తువులు, మూడు పొరల ఫిషింగ్ నెట్‌లు, బహిష్కృత దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను తీసుకెళ్లడం కూడా నేరంగా పరిగణిస్తారు. ముద్రిత వస్తువులు, ఆయిల్ పెయింటింగ్‌లు, ఛాయాచిత్రాలు, పుస్తకాలు, రాతి శిల్పాలను కూడా తీసుకెళ్లకూడదు. నకిలీ కరెన్సీ, ఇంట్లో వండిన ఆహారం, మాంసాహారం కూడా తీసుకెళ్లకూడదు. ప్రయాణికులెవరైనా ఈ నిషేధిత వస్తువులను తీసుకెళ్తున్నట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కొన్ని రకాల వస్తువులను చెల్లింపుతో తీసుకెళ్లవచ్చు. ఈ జాబితాలో మొక్కలు, ఎరువులు, మందులు, వైద్య పరికరాలు, పుస్తకాలు, సౌందర్య సాధనాలు, ట్రాన్స్మిషన్, వైర్‌లెస్ పరికరాలు,  ఆల్కహాలిక్ పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఈ-సిగరెట్లు,  ఎలక్ట్రానిక్ హుక్కాలు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)