తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవన సముదాయం రూ.2,583 కోట్ల వ్యయంతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 36.52 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టనున్నారు.8.4 లక్షల చదరపు అడుగుల్లో 6 అంతస్తుల్లో ప్రధాన కోర్టు భవనం ఏర్పాటు కానున్నది. ఒకేసారి 2,800 కార్లు నిలిపేలా పార్కింగ్ సదుపాయం చేయనున్నారని సమాచారం అందుతోంది. ఇక రూ.2,583 కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవన సముదాయం నిర్మాణం కానున్ననమూనాను విడుదల చేశారు.
రూ.2583 కోట్ల వ్యయంతో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణం
February 17, 2025
0
Tags