ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్, రాయ్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు యువతులు రోడ్డుపై ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ కనిపించారు. ఆ కొట్లాటకు కారణం ఒక అబ్బాయి. ఆ అబ్బాయి తమ బాయ్‌ఫ్రెండ్ అని ఇద్దరూ చెప్పుకున్నారు. వైరల్ వీడియోలో ముగ్గురు నలుగురు యువతులు ఉన్నారు. వారిలో ఇద్దరు ఒకరి జుట్టు ఒకరు లాగుతున్నారు, ఒకరినొకరు తన్నారు, నేలకేసి కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ కొట్లాటలో ఒక యువతి బట్టలు చిరిగిపోయినప్పటికీ, కొట్లాట ఆగిపోయే సూచనలు కనిపించలేదు. అక్కడ కొంతమంది వారిని ఆపడానికి ప్రయత్నించారు, కానీ ఆ యువతులు ఎవరి మాట వినడానికి సిద్ధంగా లేరు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ప్రతిచోటా చర్చనీయాంశమవుతోంది.
అబ్బాయి కోసం ఇద్దరు యువతుల సిగపట్లు !
February 17, 2025
0
Tags