మహిళల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో రెండోసారి ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. విజేత జట్టుకు రూ. 5 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు బోర్డు వెల్లడించింది. 'విశ్వ విజేతలకు శుభాకాంక్షలు. అండర్-19 ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకున్న జట్టు సభ్యులకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించాం. రెండోసారి వరల్డ్‌కప్ గెలిచిన జట్టు, సహాయక సిబ్బంది రూ. 5 కోట్లు అందిస్తాం' అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా టైటిల్ గెలిచిన భారత జట్టుకు హైదరాబాద్‌కు చెందిన నౌషీన్ అల్ ఖదీర్ హెడ్ కోచ్‌గా వ్యవహరించింది. ఈ విజయం దేశంలో మహిళల క్రికెట్ ప్రాధాన్యత మరింత పెంచుతుందని బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. జట్టంతా సమష్టిగా రాణించడంతోనే ఈ ప్రదర్శన సాధ్యమైందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 2023లో తొలిసారి జరిగిన అండర్-19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కూడా అప్పట్లో బోర్డు రూ. 5 కోట్ల నజరానా అందించింది.
మహిళల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ రూ. 5 కోట్ల నజరానా !
February 03, 2025
0
Tags