మహిళల అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. త్రిషతోపాటు జి.కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ ఎంపికయ్యారు. టోర్నీలో 11 వికెట్లు పడగొట్టిన సౌతాఫ్రికా క్రికెటర్ కైలా రేనెకే కెప్టెన్‌గా ఐసీసీ ప్రకటించింది.సభ్యులు : గొంగడి త్రిష (భారత్), జెమ్మా బోథా (దక్షిణాఫ్రికా), పెర్రిన్ (ఇంగ్లాండ్), జి.కమలిని (భారత్), కావోయిమ్‌హే బ్రే (ఆస్ట్రేలియా), పూజ మహతో (నేపాల్), కైలా రేనెకే (కెప్టెన్) (దక్షిణాఫ్రికా), కేటీ జోన్స్ (వికెట్‌కీపర్) (ఇంగ్లండ్), ఆయుషి శుక్లా (భారత్), చమోడి ప్రబోద (శ్రీలంక), వైష్ణవి శర్మ (భారత్), న్తాబిసెంగ్ నిని (దక్షిణాఫ్రికా).
మహిళల అండర్-19 ప్రపంచకప్ టోర్నీఅత్యుత్తమ జట్టును ప్రకటించిన ఐసీసీ
February 03, 2025
0
Tags