మహా కుంభమేళాలో ఒళ్లంతా బంగారంతో గోల్డెన్ బాబా సందడి చేస్తున్నారు. కేరళకు చెందిన ఈ గోల్డెన్ బాబా ఒంటిపైన ఏకంగా 6 కిలోల బంగారు ఆభరణాలను ధరించి మహా కుంభమేళాలో తిరుగుతున్నారు. ఈ గోల్డెన్ బాబా ఇప్పుడు కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఒళ్లంతా బంగారం పెట్టుకొని తిరుగుతున్న ఈ బాబా పైన ప్రతి ఒక్కరి ఆసక్తి నెలకొంది. అసలు ఇంతకీ ఎవరు ఈ బాబా, ఏం చేస్తుంటాడు అనేది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. గోల్డెన్ బాబా అసలు పేరు మహామండలేశ్వర్ నారాయణా నంద్ గిరి మహరాజ్. నిరంజని అఖాడకు చెందిన ఈ బాబా కేరళలోని సనాతన ధర్మ ఫౌండేషన్ కు చైర్మన్ గా ఆయన సేవలందిస్తున్నాడు. ఇక గోల్డెన్ బాబా తన శరీరం పైన ధరించిన వివిధ బంగారు ఆభరణాల గురించి వివరించాడు. పగడాలు, రుద్రాక్షలు, రూబీలు, నీలమణులు, పచ్చలు పొదిగిన నగల నుండి తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆయన పేర్కొన్నారు. వివిధ దేవతామూర్తులకు గుర్తుగా తాను 15 సంవత్సరాలుగా ఈ బంగారు ఆభరణాలను ధరిస్తున్నానని వీటి వల్ల తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆయన తెలిపారు. ఇక శ్రీ యంత్రంతోపాటు తాను వేసుకున్న నగలను కూడా పూజలలో ఉపయోగిస్తానని గోల్డెన్ బాబా తెలిపారు.
మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గోల్డెన్ బాబా !
January 19, 2025
0
Tags