సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే లక్ష్యంగా గంజాయి, హాష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్‌ ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 830 గ్రాముల గంజాయి, 14 గ్రాముల హాష్ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. విద్యార్థులకూ గంజాయి అలవాటు చేసి విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన రాజు జాట్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 62 కిలోల గంజాయి స్వధీనం చేసుకున్నారు. రాజు జాట్‌ ఒడిశాలో గంజాయి కొని తెలంగాణ, మహారాష్ట్రలో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)