తెలంగాణాలో వాహనం లోయలో పడి ఇద్దరు మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గుడి హాత్నూర్ మండలం సూర్యగూడకు చెందిన 60 మంది యాత్రికులు వాహనంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరిమెరిలోని జంగుబాయి ఆలయానికి వెళ్తుండగా ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలం మాలెపూర్ ఘాట్ లో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న 47 మంది యాత్రికులకు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు స్పాట్ లోనే మరణించారు. మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ రిమ్స్, ఉట్నూర్, నార్నూర్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొద్ది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)