ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్ హతం మృతి

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ ముగ్గురు నక్సల్స్‌ మృతి చెందారు. భద్రతా బలగాలు నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో ఉండగా ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందరాజ్ పి తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ , జిల్లా బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు చెప్పారు. ఇరువైపుల నుంచి కాల్పులు నిలిచిపోగానే ఘటనా ప్రాంతం వద్ద యూనిఫాంతో ఉన్న ముగ్గురు నక్సల్ మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్ధాలను కూడా ఘటనా స్థలి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)