వారానికి 90 గంటల పని చేయాలంటూ ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణియన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు పారిశ్రామికవేత్తలు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ తన భార్య ఓ అద్భుతమైన వ్యక్తి అని ఆమెను చూస్తూ ఉండిపోవడం తనకెంతో ఇష్టమని చెప్పారు. వారానికి ఎన్ని గంటలు పనిచేస్తున్నామనేది ముఖ్యం కాదనీ, ఆ పనిని ఎంత సమర్థవంతంగా పూర్తి చేశామనేదే ముఖ్యమన్నారు. క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలన్నారు. ఓ పెద్ద కంపెనీకి చైర్మన్‌గా నిత్యం బిజీబిజీగా ఉండే తాను ఇలా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటంపై నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తుంటారని అన్నారు. తాను సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేస్తున్నానని మరికొందరు కామెంట్స్ పెడుతుంటారన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వెనుక తన ఉద్దేశం, తన లక్ష్యం వేరని ఆనంద్ మహీంద్రా అన్నారు. కొత్త స్నేహితులను సంపాదించుకోవడానికి తాను ఇక్కడ లేనని, సోషల్ మీడియా ఒక గొప్ప బిజినెస్ టూల్ అని వివరించారు. ఒకే వేదికపై కోటి మందికి పైగా ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ పొందే అవకాశం తనకు ట్విట్టర్ ద్వారా కలుగుతోందన్నారు.
క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యం : ఆనంద్ మహీంద్రా !
January 12, 2025
0
Tags