బీసీసీఐ కొత్త కార్యదర్శిగా దేవజిత్ సైకియా ?

Telugu Lo Computer
0


బీసీసీఐ కొత్త కార్యదర్శిగా దేవజిత్ సైకియా బాధ్యతలు చేపట్టారు. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఎంపికయ్యాక తరువాత ఇప్పటివరకు తాత్కాలిక కార్యదర్శిగా వ్యవహరించిన సైకియా ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. అసోం నుంచి సైకియా క్రికెట్ జర్నీ ప్రారంభమైంది. కొంత కాలం పాటు దేశవాళ్లీ క్రికెట్ లో ఆడారు. 1990-91 మధ్య అసోం తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా రాణించారు. 59 పరుగులు చేశారు. 9 స్టంపౌట్ లు చేశారు. 28 ఏళ్ల వయసులో గౌహతి హైకోర్టులో లాయర్ గానూ పని చేశారు. ఆ తర్వాత బోర్డు అధికారిక కార్యకలపాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. ముఖ్యంగా జై షా బోర్డు కార్యదర్శిగా ఎంపికయ్యాక సైకియాకు ప్రాధన్యత ఎక్కువగా పెరిగిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే తన వారసుడిగా సైకియాకు జై షానే ఎంపిక చేశారనే ప్రచారం కూడా సాగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)