తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 17 నుండి 23వ తేదీ వరకు పెట్టుబడులే లక్ష్యంగా విదేశాల్లో పర్యటించనున్నారు. తొలుత సింగపూర్ వెళ్తారు. అక్కడ షాపింగ్ మాల్స్, స్టేడియంలు పరిశీలించనున్నారు. ఆ తరువాత అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. రేవంత్ రెడ్డి రెండురోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. జనవరి 19న సింగపూర్ నుండి స్విట్జర్లాండ్‌లోని దావోస్ వెళ్తారు. దావోస్‌లో ప్రతీ సంవత్సరం జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. జనవరి 23న ఇండియాకు తిరిగిరానున్నారు. సీఎం అయ్యాక పెట్టుబడులు ఆకర్షించడం కోసం విదేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ నెల 14న ఢిల్లీలో జరగనున్న ఏఐసిసి సమావేశం కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి నుండే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
17 నుండి 23 వరకు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన !
January 12, 2025
0
Tags