పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి బెయిల్‌ మంజూరు చేసిన పుణె కోర్టు !

Telugu Lo Computer
0


రువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి  పుణె కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వి.డి సావర్కర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాహుల్‌పై సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తాజా విచారణకు రాహుల్‌ గాంధీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. దీంతో ఆయనకు రూ.25వేల పూచీకత్తు బాండ్‌పై ఎంపీ/ఎమ్మెల్యే న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. రాహుల్‌ గాంధీకి పూచీకత్తుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మోహన్‌ కోర్టు ముందు హాజరయ్యారు. మరోవైపు, ఈ కేసులో రాహుల్‌ హాజరు విషయంలో న్యాయస్థానం శాశ్వత మినహాయింపు కల్పించిందని ఆయన తరఫు న్యాయవాది మిలింద్‌ పవార్‌ వెల్లడించారు. ఈ అంశంపై తదుపరి విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా పడినట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)