రిపబ్లిక్ డే సందర్భంగా భారీ ఆఫర్లతో ఫ్లిప్ కార్డ్ డిస్కౌంట్ సేల్ తీసుకువచ్చింది. ఈ సేల్ జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ఒక రోజు ముందు ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కి ఈ సేల్ ప్రారంభమవుతుంది. వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ ప్లాట్ ఫారం ఈ సేల్ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని ఆశించడానికి ప్లాన్ చేస్తుంది. కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాంకు ఆఫర్లను, తగ్గింపులను, క్యాష్ బ్యాక్ లను కూడా అందిస్తూ ఈ సేల్ ను బాగా ప్లాన్ చేసింది. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే స్పెషల్ సేల్ మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు మరియు గృహపుకరణాలకు వివిధ కేటగిరీలపై డిస్కౌంట్లను అందిస్తుంది. విక్రయ సమయంలో కొనుగోలుదారులు హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డులు మరియు ఈఎంఐ ద్వారా లావాదేవీలను చెల్లించడం ద్వారా 10% తక్షణ తగ్గింపును పొందుతారు. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ జనవరి 13న తగ్గింపు ధరలతో విక్రయించబడుతుందని తెలిపారు. ప్రస్తుత ఆఫర్ ఐఫోన్ 16 ఆఫర్ ధర 63,399 రూపాయలుగా ఉంటే, అసలు ధర 79,900 రూపాయలుగా ఉంది. ఐఫోన్ 16 ప్లస్ 73, 999 రూపాయలుగా ఉంది. దీని అసలు ధర 89, 900 రూపాయలు. గూగుల్ పిక్సెల్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ప్లస్ వంటి మొబైల్ ఫోన్ల పైన కూడా భారీ డిస్కౌంట్ లను ఇస్తోంది. ఇక స్మార్ట్ టీవీ ల పైన భారీ డిస్కౌంట్ ను హోం మరియు కిచెన్ ప్రొడక్ట్స్ పైన అద్భుతమైన ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది.
14 నుంచి ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ !
January 10, 2025
0
Tags