డిమాండ్ లేని విశాఖపట్నం - దుర్గ్ వందేభారత్ రైలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు రెండు, దుర్గ్ కు ఒకటి, భువనేశ్వర్ కు ఒకటి, విజయవాడ నుంచి ఒకటి, కాచిగూడ నుంచి ఒకటి, సికింద్రాబాద్ నుంచి నాగపూర్ కు ఒకటి మొత్తం ఏడు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో విశాఖపట్నం నుంచి చత్తీస్ గడ్ రాష్ట్రంలోని దుర్గ్ కి నడుపుతున్న వందేభారత్ రైళ్లల్లో ప్రయాణికులే ఎక్కడంలేదు. దీంతో ప్రయాణికులు ఈరోజు నుంచి 8 బోగీలతో మాత్రమే నడుపుతున్నారు. ప్రారంభంలో 16 బోగీలతో నడిపారు. ఆక్యుపెన్సీ చాలా దారుణంగా ఉంటోంది. దుర్గ్ నుంచి తిరుగు ప్రయాణంలో రాయగడ వరకు 50 శాతం, విశాఖపట్నంకు 25 శాతమే ఆక్యుపెన్సీ ఉంటోంది. నేటి నుంచి 8 బోగీలతో నడుపుతారు. వీటిల్లో ఏడు బోగీలు చైర్ కార్, ఒక బోగీ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటుంది. ఇందులో కేవలం 40 సీట్లే ఉంటాయి. చత్తీస్ గడ్ నుంచి పొట్ట కూటి కోసం దేశంలోని ప్రధాన నగరాలకు ఎంతోమంది వలస వస్తుంటారు. ఇటువంటి ప్రాంతానికి భారీ ఛార్జీలతో వందేభారత్ నడిపితే లాభసాటిగా ఉంటుందని అధికారులకు ఎవరైతే సలహా ఇచ్చారో వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని నెటిజన్లు కొందరు కామెంట్లు పెడుతున్నారు. డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తే పర్వాలేదుకానీ డిమాండ్ లేనిచోట నడపడంవల్ల ఉపయోగం ఉండదని, దానికి బదులుగా సాధారణ ఛార్జీలతో ఒక సూపర్ ఫాస్ట్ రైలు నడపాలని కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)