హైదరాబాద్ లోని అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధి, గుడిమల్కాపూర్ లోని పీవీ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 111 వద్ద కట్టెల గోదాంలో శుక్రవారం మధ్యాహ్నాం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కట్టెల గోదాంకు ఓ వైపున మెకానిక్ షెడ్, మరో వైపున విద్యుత్ సబ్ స్టేషన్ ఉంది. అయితే మెకానిక్ షెడ్ కు మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఇక మెకానిక్ షెడ్ లో ఉన్న గ్యాస్ సిలిండర్లను కూడా స్థానికులు బయటకు తీసుకొచ్చారు. సిలిండర్లకు కానీ, ఇటు విద్యుత్ సబ్ స్టేషన్ కు కానీ మంటలు అంటుకుని ఉంటే భారీ ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
గుడిమల్కాపూర్ కట్టెల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
January 24, 2025
0
Tags