దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు, గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఆఖర్లోనూ అమ్మకాలు కొనసాగడంతో సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ ఉదయం 76,455.35 పాయింట్ల వద్ద (76,520.38) స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. తర్వాత లాభనష్టాల మధ్య కదలాడింది. ఇంట్రాడేలో 76,091.75 - 76,985.95 మధ్య చలించిన సూచీ.. చివరికి 329.92 పాయింట్ల నష్టంతో 76,190.46 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 113.15 పాయింట్ల నష్టంతో 23,092.20 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 22 పైసలు బలపడి 86.22 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 78.60 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2780.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
రోజంతా ఒడుదొడుకుల్లోనై నష్టాల్లో ముగిసిన సూచీలు !
January 24, 2025
0
Tags