అమెరికాలో తమ పిల్లలను చూసేందుకు వచ్చిన భారతీయ దంపతులకు రిటర్న్ టికెట్లు లేవన్న కారణంతో నెవార్క్ విమానాశ్రయంలో అధికారులు ప్రవేశం నిరాకరించారు. ఐదు నెలల పాటు ఇక్కడే ఉండాలనే ఆలోచనతో ఈ జంట బీ-1/బీ-2 విజిటర్ వీసాలపై అమెరికాకు వెళ్లారు. అయితే 2025 నిబంధనల ప్రకారం రిటర్న్ టికెట్ తప్పనిసరి అని ఇమ్మిగ్రేషన్ అధికారులు వారికి చెప్పారు. ఆ విషయం తమకు తెలియదని సదరు భారతీయ దంపతులు స్పష్టంగా చెప్పారు. కానీ ఎంత విన్నవించినా, వివరణ ఇచ్చినా ఆ తల్లిదండ్రులను విమానాశ్రయం నుంచి నేరుగా భారత్కి పంపించేసినట్టు తెలుస్తోంది. ఈ కొత్త రూల్ గురించి యూఎస్ అధికారుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేనందున ఈ పరిణామం చాలా మంది భారతీయ ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తోంది. ఊహించని విధంగా ఈ నిబంధనను అమలు చేయడం ప్రయాణికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. 2025 రూల్స్ అంటూ ఎంట్రీని నిరాకరించారు. అయితే, ఈ మార్పులకు సంబంధించి ముందస్తు సమాచారం లేదా బహిరంగ సమాచారం లేకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి, ఆవేదనకు, ఆందోళనకు గురిచేస్తోంది. భారతీయ దంపతులను ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వెనక్కి పంపించేశారన్న వార్త ప్రవాస భారతీయులు, అమెరికాకు వచ్చే సందర్శకుల్లో ప్రమాద ఘంటికలు మోగించింది. ఎయిర్పోర్ట్ ఎంట్రీల్లో ఇంకేం ఊహించని చర్యలు అమలు చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రిటర్న్ టికెట్లు లేవన్న కారణంతో దిగిన వెంటనే భారత దంపతులను వెనక్కి పంపిన అమెరికా అధికారులు !
January 24, 2025
0
Tags