డోజ్ తప్పుకుంటున్నట్లు వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ప్రకటన

Telugu Lo Computer
0


మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లుగా వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. కీలకమైన డోజ్ బాధ్యతలను ఎలాన్ మస్క్ తో పాటు వివేక్ రామస్వామిని ట్రంప్ నియమించారు. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే వివేక్ రామస్వామి ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.  ఒహైయో గవర్నర్ గా పోటీ చేసేందుకే వివేక్ రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో స్పష్టత ఇస్తానని ఎక్స్లో పోస్టు పెట్టారు రామస్వామి. ఈ సందర్బంగా వివేక్ రామస్వామి తన ట్వీట్ లో డోజ్ శాఖ సృష్టికి సాయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, ఎలాన్ మస్క్ బృందం దానిని సమర్థవంతంగా నడిపిస్తుందనే నమ్మకం తనకు ఉందంటూ రామస్వామి తన ట్వీట్ లో తెలిపారు. వృథా ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్ పని చేస్తోంది. అమెరికాలో రామస్వామికి రోవాంట్ సైన్సెస్ అనే బయోటెక్ కంపెనీ ఉంది. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు ఎలాన్ మస్క్ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించి, ఆయన ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, విరాళంగా 100 మిలియన్ డాలర్లు అందజేశారు. సోషల్ మీడియాలో ట్రంప్ మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)