ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధికారి షాపులకు అప్లికేషన్లు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.. ఆయా జిల్లాల కలెక్టర్లు ఆధ్వర్యంలో లాటరీలు తీసి లైసెన్స్ లకు ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు తమ కుల, నేటివిటీ ధ్రువపత్రాలు సమర్పించాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఒక షాపుకి ఫీజు 2 లక్షల రూపాయల నాన్ – రిఫండబుల్ మొత్తాన్ని నిర్ణయించారు.. ఒక అభ్యర్థి ఆయా జిల్లాల పరిధిలో కేటాయించిన అన్ని షాపులకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది.. కానీ, ఒక అభ్యర్థికి ఒక షాపు మాత్రమే కేటాయించనున్నట్టు స్పష్టం చేసింది.. ఒకటి కంటే ఎక్కువ షాపులు వస్తే ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం ఇక, రెండేళ్ల కాలానికి లైసెన్స్ ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయిస్తూ నోటిఫికేషన్ జారీ
January 21, 2025
0
Tags