దావోస్ లో యూనిలివర్ తో తొలి ఒప్పందం చేసుకున్న రేవంత్ రెడ్డి బృందం !

Telugu Lo Computer
0


దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి బృందం యూనిలివర్ తో తొలి ఒప్పందం చేసుకుంది. నిత్యావసరవస్తువుల తయారీలో యూనిలివర్ కంపెనీ ప్రసిద్ధి గాంచింది. యూనిలివర్ కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయని, పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని రేవంత్ రెడ్డి ట్వీట్   చేశారు. దీంతో ప్రభుత్వానికి, యూనిలివర్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. తొలి విడతలో భాగంగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బాటిల్ క్యాప్ ల తయారీ యూనిట్ ను నెలకొల్పేందుకు కూడా యూనిలివర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)