కమండలం, కర్రతో యూట్యూబర్ ను చావబాదిన అఘోరీ బాబా : వీడియో వైరల్ !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ రోజు పుష్య పౌర్ణమి నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున మొదటి షాహీ స్నానానికి పొటెత్తారు. ప్రయాగ్ రాజ్ కుంభమేళలో పుణ్య స్నానాదులు చేసేందుకు దేశంలో ఉన్న అఘోరీలు, నాగ సాధువులు, అఖాడాల సన్యాసీలు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అఘోరీల వ్యక్తిగత విషయాలను గురించి ఇంటర్వ్యూలు చేస్తున్న ఒక యూట్యూబర్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది. కుంభమేళలో ఒక అఘోరీ బాబా దగ్గరకు యూట్యూబర్ వెళ్లాడు. అతను మీరు బాబాగా ఎలా మారారు. మీరు ఏవిధంగా పూజలు చేస్తారు.. అదే విధంగా మంత్రాలు ఏవిధంగా జపిస్తారంటూ అనేక ప్రశ్నలడిగాడు. దీంతో శివాలెత్తిపోయి సదరు అఘోరీ బాబా రెచ్చిపోయాడు. తన దగ్గరున్న కమండలం, మరో కర్రతో యూట్యూబర్ ను చావబాదాడు. దీంతో యూట్యూబర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)