తెలంగాణలోని ఆదిలాబాద్ టౌన్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి పరిసరాలను పరిశీలించిన ఎమ్మెల్యే రిమ్స్ సూపర్ స్పెషాలిట్ ఆస్పత్రిలో మరుగుదొడ్లు, మూత్రశాలలు అపరిశుభ్రంగా ఉండడంతో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇక్కడి అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదిలాబాద్ కు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కేటాయించిందన్నారు. ఆస్పత్రితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు ఉంచాలని సంబంధిత కాంట్రాక్ట్ సిబ్బందికి సూచించారు. ఆస్పత్రికి నిరుపేద రోగులు ఎంతో మంది వైద్యంపై నమ్మకంతో వస్తారని, వారికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని రిమ్స్ డెరైక్టర్ జై సింగ్ రాథోడ్ కు సూచించారు. ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం కారణమని మండిపడ్డారు. అదేవిధంగా ఆస్పత్రి ప్రారంభమైన 3 ఏళ్లకే సీలింగ్ ఊడిపోవడంపై ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. ఆస్పత్రిలో పూర్తి సౌకర్యాలతో పాటు, పరిశుభ్రమైన వాతావరణం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.
ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అపరిశుభ్రత : ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆగ్రహం !
January 13, 2025
0
Tags