ఉత్తర సరిహద్దు వెంబడి సైనికుల సంఖ్యను తగ్గించం !

Telugu Lo Computer
0


చలికాలంలో ఉత్తర సరిహద్దు వెంబడి సైనికుల సంఖ్యను తగ్గించాలని భారత్ చూడటం లేదన్నారు. చైనాతో చర్చల ఫలితాల ఆధారంగా వేసవి విస్తరణను సమీక్షిస్తామని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం సరిహద్దు ఘర్షణల వల్ల 20 మంది భారతీయ, నలుగురు చైనా సైనికులు చనిపోయారు. దీని తరువాత కొత్త ఘర్షణలను నివారించడానికి లడఖ్‌లోని సరిహద్దులో రెండు వైపులా పెట్రోలింగ్ నిలిపివేశారు. అదే సమయంలో పదివేల మంది కొత్త బలగాలు, సైనిక సామగ్రిని గడ్డకట్టే పర్వత ప్రాంతానికి దగ్గరగా తరలిస్తున్నారు. భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్టంభన తొలగించేందుకు గతేడాది అక్టోబర్‌లో ఇరుదేశాలూ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయ. ఆ తర్వాత బలగాల ఉపసంహరణ చేపట్టారు. వాస్తవానికి శీతాకాలపు మోహరింపుల్లో దళాల సంఖ్య తగ్గిస్తారు. అయితే తాము ప్రస్తుతానికి బలగాలను వెనక్కి రప్పించడం లేదని ఆర్మీఛీఫ్ వెల్లడించారు. చైనాతో తదుపరి చర్చల ఆధారంగా భవిష్యత్ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయన్నారు. అలాగే తూర్పు లడఖ్‌లోని దేప్సాంగ, డెమ్‌చోక్‌లలో సాంప్రదాయ ప్రాంతాలలో పెట్రోలింగ్ ప్రారంభించినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)