భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం రింకు సింగ్‌ను టీమ్ ఇండియాలో చేర్చారు. అంతకు ముందే రింకు సింగ్ కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో తను డబ్బు పంచుతూ కనిపిస్తున్నాడని చెబుతున్నారు. రింకు సింగ్ అలీఘర్‌లో కొత్త ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడ గృహప్రవేశ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రింకు సింగ్ డబ్బు పంపిణీ చేశాడని వైరల్ వీడియో ద్వారా ప్రచారం జరిగింది. టీం ఇండియా ప్లేయర్ రింకు అలీఘర్‌లో ఒక ఇల్లు కట్టుకున్నాడు. దీనికోసం ఆయన గృహప్రవేశ వేడుక నిర్వహించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. రింకు ఆ డబ్బును చెఫ్స్, అతని వద్ద పనిచేసే ఇతరులకు పంచాడు. దాని వీడియోలు చాలా వరకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ఎక్స్ లో షేర్ చేయబడ్డాయి. అయితే, ఈ విషయంపై రింకు సింగ్ నుండి ఎటువంటి స్పందన రాలేదు.
అలీఘడ్‌లో డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కిన రింకు సింగ్ : వీడియో వైరల్
January 19, 2025
0
Tags