ప్రాణం తీసిన హెర్నియా ఆపరేషన్‌!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా, ఎర్రగుంట్ల మండలం తుమ్మల పల్లెకు చెందిన వడ్డెరపు రమాదేవి హెర్నియా సమస్యతో జనవరి 16న గాంధీరోడ్డు లోని కేవీఆర్‌ హాస్పిటల్‌లో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు హె ర్నియా ఆపరేషన్‌ చేయాలని తెలిపారు. దీంతో వారు ఆపరేషన్‌కు సిద్దపడ్డా రు. జనవరి 17న ఆపరేషన్‌ చేసి సక్సెస్‌ అయ్యిందని వైద్యులు తెలిపినట్లు రమాదేవి భర్త శ్రీనివాసులు వెల్లడిం చారు. అయితే రమాదేవిని ఐసీయూ లో ఆబ్జర్వేషన్‌లో వుంచామని ఆమె ఆ రోగ్యంగా వుందని నమ్మబలికారన్నారు. కానీ శనివారం ఉదయం నుంచీ ఆమె ను చూసేందుకు అనుమతించమని కోరినా వారు చూపించకపోవడంతో రమాదేవికి ఏదో అయిందనే అనుమానం వచ్చిందన్నారు. దీంతో బంధువులు, ఊరి వారిని ఆస్పత్రి వద్దకు రావాలని చెబుతుండగానే ఆస్పత్రికి పోలీసులు వచ్చారన్నారు. అంతేకాకుండా ప్రైవేటు వ్యక్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారన్నారు. దీంతో రమాదేవి మరణించిందని ఖరారు చేసుకున్నామన్నారు. జమ్మలమడుగు మాజీ ఎమ్మె ల్యే సుధీర్‌ రెడ్డి వచ్చాక ఆయనతో పా టు మమ్మల్ని లోపలికి అనుమతించార న్నారు. ఆస్పత్రిలో రమాదేవి ఆపరేషన్‌ తరువాత మరణించడంపై కనీసం సమాచారం కూడా ఇవ్వని డాక్టర్‌, ఆస్ప త్రి సిబ్బందిపై త్రీటౌన్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కనీసం ఫిర్యాదు స్వీకరించలేదని రమాదేవి భర్త ఆవేద న వ్యక్తం చేశారు. రమాదేవికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు వున్నాడని, భర్త జువారి ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్‌ లేబర్‌ గా పనిచేస్తున్నాడని మృతురాలి బంధువులు తెలిపారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తు న ఆందోళనలో డిమాండ్‌ చేశారు. మహిళ మృతిపై కేవీఆర్‌ ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్‌ ప్రదీప్‌రెడ్డిని వివరణ కోరగా పేషంట్‌ రమాదేవి హెర్నియా సమస్యతో కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చిందన్నారు. ఆమెకు చాలాకాలంగా హెర్నియా వుందని అనేకసార్లు స్కానింగ్‌ చేయించిన హిస్టరీ మాకు వారు తెలపలేదు. పరిస్థితి చూసి ఆమెకు ఆపరేషన్‌ చేయాలని కుటుంబసభ్యుల అనుమతి తీసుకొని ఆపరేషన్‌ చేశాం. దాదాపు మూడున్నర గంటల పాటు కష్టపడి ఆమెకు ఆపరేషన్‌ చేశాం. లోపల ప్రేవులు చాలా మడత పడ్డాయి. ఆపరేషన్‌ మాత్రం సక్సెస్‌ అయ్యింది. తరువాత ఆమెకు బీపీ పల్స్‌ డౌన్‌ అయ్యి శాచురేషన్‌ పాయింట్‌లు పడిపోయాయి. సీపీఆర్‌చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశాం కానీ ఫలి తం లేకుండాపోయిందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)