కామెడీ, కుటుంబ కథా చిత్రాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నఅనిల్ రావిపూడి !

Telugu Lo Computer
0


నిల్ రావిపూడి తనదైన హాస్యంతో మళ్లీ కామెడీ చిత్రాలకు, కుటుంబ కథా చిత్రాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్‌హిట్ కావడంతో ప్రస్తుతం ఆయన పేరు చిత్ర సీమలో మారుమోగుతోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ వంటి భారీ చిత్రాలు లైన్‌లో ఉన్నప్పటికీ తన సినిమాను హిట్‌గా నిలబెట్టారు. ఇక దిల్‌రాజైతే ఆయనను ఆకాశానికెత్తేస్తున్నారు. వరుస ఫ్లాప్స్‌తో ఉన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ను ఒడ్డున పడేశాడని దిల్‌రాజు ఆయన సోదరుడు శిరీశ్‌లు అనిల్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ సినిమా ఘన విజయం ద్వారా అనిల్ ఓ అరుదైన ఘనతను సాధించారు. ఆయన దర్శకత్వం వహించిన గత నాలుగు చిత్రాలు ( ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి ) వరుసగా యూఎస్‌లో మిలియన్ డాలర్లతోపాటు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ద్వారా ఐదవసారి ఈ ఘనత అందుకున్నారు. అలాగే విక్టరీ వెంకటేష్‌తో చేసిన మూడు సినిమాలు మూడు సార్లు మిలియన్ డాలర్లను, మూడు సార్లు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వెంకీకి లక్కీ డైరెక్టర్‌గా మారిపోయారు. టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత అంతటి సక్సెస్ రికార్డును సొంతం చేసుకున్న దర్శకుడిగా అనిల్ నిలిచాడని ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)