అమూల్ పాల ధరలను తగ్గించింది. బ్రాండ్ యాజమాన్య సంస్థ అయిన గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తమ ప్రముఖ పాల రకాలైన అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ ఫ్రెష్ ధరలను లీటర్‌కు రూ.1 చొప్పున తగ్గించింది. కొత్త రేట్లు జనవరి 24 నుండి తక్షణమే అమల్లోకి వస్తాయని జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జాయెన్ మెహతా ప్రకటించారు. ఈ తగ్గింపు 1-లీటర్ ప్యాక్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ధరల మార్పు తర్వాత ఒక లీటర్ అమూల్ గోల్డ్ మిల్క్ ధర రూ.66 నుండి రూ.65కి తగ్గుతుంది.అమూల్ టీ స్పెషల్ మిల్క్ ఒక లీటర్ ప్యాకెట్ ధర రూ.62 నుండి రూ.61కి తగ్గుతుంది. అమూల్ తాజా పాల ధర లీటరుకు రూ.54 నుంచి రూ.53కి తగ్గనుంది.
పాల ధరలు తగ్గించిన అమూల్ !
January 24, 2025
0
Tags